ఇందిరమ్మ ప్రజా పాలనలో మహిళలకు పెద్ద పీట
నారాయణపేట జూలై 29, తెలంగాణ జ్యోతి : రాష్ట్రంలోని ఇందిరమ్మ ప్రజాపాలన లో మహిళలకు పెద్ద పీఠ వేసిందని, ప్రతి పథకం మహిళల పేరుపై ఇస్తున్నామని క్రీడలు, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట పట్టణం లోని ఎస్ఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్దిదారులకు నూత న ఆహార భద్రత కార్డుల ను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కృత నిక్షయం తో ఉన్నారని, వేల కోట్ల రూపాయ లను వడ్డీ లేకుండా రుణాలు అంది స్తున్నామని చెప్పారు. ఇళ్లు లేని ప్ర తి ఒక్కరికి దశల వారీగాఇందిరమ్మ ఇల్లు అందిస్తామని చెప్పారు. ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరు నిర్మించు కోవాలని, బిల్లులు ఇప్పించే బాధ్య త తమదే అని చెప్పారు.