బైరంకొండ పాఠశాలకు ఉపాధ్యాయుల నియామకం అత్యవసరం

బైరంకొండ పాఠశాలకు ఉపాధ్యాయుల నియామకం అత్యవసరం

బైరంకొండ పాఠశాలకు ఉపాధ్యాయుల నియామకం అత్యవసరం

నారాయణపేట,జూలై 29, తెలంగాణ జ్యోతి : మండలంలోని బైరంకొండ గ్రామ పాఠశాలలో తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తులు జిల్లా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు సాయిబన్న, రామకృష్ణ, శివప్పతో పాటు గ్రామ యువకులు ప్రహ్లాద్, ఆనంద్, నరేష్, సాయిలు, లక్ష్మప్ప తదితర నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం, బైరంకొండ పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మొత్తం 265 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, టీచర్ల సంఖ్య కేవలం 6 మందికే పరిమితమవడంతో విద్యా ప్రమాణాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. తగిన బోధనా సౌకర్యాలు లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు ఇతర పాఠశాలలకు టీసీలు తీసుకుని వెళ్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే మండలంలోని పలుచోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో, వెంటనే అవసరమైన టీచర్లను నియమించాలని జిల్లా విద్యాధికారులను వారు కోరారు. ఇప్పటికే ఈ సమస్యపై అనేకమార్లు మండల విద్యా అధికారులకు తెలపినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో, ఈసారి జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లామని నాయకులు తెలిపారు. తగిన చర్యలు తీసుకోకపోతే పాఠశాల వద్ద గాని, అధికారుల కార్యాలయం ముందు గాని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగేందుకు వెనుకాడ బోమని వారు హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment