విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షురాలిగా బందీగి సురేఖ
నారాయణపేట, జూలై 28, తెలంగాణ జ్యోతి : విశ్వహిందూ పరిషత్ నారాయణపేట జిల్లా అధ్యక్షురాలిగా బందీగి సురేఖ రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జిల్లా అధ్యక్షుడి గా సేవలందిస్తున్న డాక్టర్ రాంబాబు ఆకస్మికంగా మృతిచెందిన నేపథ్యంలో ఆయన సతీమణి సురేఖ విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు. నాలుగు నెలలపాటు రాంబాబు సమర్థవంతంగా విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాలకు నాయకత్వం వహించి జిల్లాలో మంచి గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర స్థాయి నేతలు, యాదగిరిగుట్టలో జరిగిన రాష్ట్ర ప్రాంతీయ సమావేశంలో సురేఖను నూతన అధ్యక్షురాలిగా ప్రకటించారు. తన భర్త ఆశయాలను కొనసాగిస్తూ నారాయణపేట జిల్లాలో హిందూ ధర్మ పరిరక్షణ, విశ్వహిందూ పరిషత్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె ప్రకటించారు.