జూనియర్ కళాశాల పాత బిల్డింగ్ కూల్చి, నూతన నిర్మాణానికి చర్యలు తీసుకోండి

జూనియర్ కళాశాల పాత బిల్డింగ్ కూల్చి, నూతన నిర్మాణానికి చర్యలు తీసుకోండి

జూనియర్ కళాశాల పాత బిల్డింగ్ కూల్చి, నూతన నిర్మాణానికి చర్యలు తీసుకోండి

– ఎమ్మెల్యేకు పి.డి.ఎస్.యు వినతి

నారాయణపేట,జూలై 28,తెలంగాణజ్యోతి : నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో పాత బిల్డింగ్‌ను కూల్చి, నూతన భవనం నిర్మించాలని, అలాగే శిథిలావస్థలో ఉన్న మూత్రశాలలు, మరుగుదొడ్లను త్వరగా పూర్తి చేయాలని పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు ఎస్. సాయికుమార్ స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికరెడ్డికి వినతిపత్రం అందజేశారు. గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న పాత బిల్డింగ్‌లో ప్రస్తుతం కూడా కొంతమంది విద్యార్థులు తరగతులు కొనసాగి స్తున్నారు. ఇప్పటికే కొన్ని గదుల్లో పై పెచ్చులు ఊడిపోవడం వంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అకాల వర్షాలు కురుస్తుండటంతో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన తెలిపారు. గతంలోనే బిల్డింగ్ కూల్చేందుకు నిధులు మంజూరు అయినా, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. ఇటీవల రాజస్థాన్‌లో స్కూల్ పాత బిల్డింగ్ కూలి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఉదాహరణగా చూపుతూ, నారాయణపేట కళాశాల పాత బిల్డింగ్‌ను తక్షణమే కూల్చాలని డిమాండ్ చేశారు. కళాశాలలో సుమారు 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ వారికి తగిన మూత్రశాలలు లేవు. బాలికలకు ఉన్న మూడు శౌచాలయాలు శిథిలావస్థలో ఉండగా, బాలురకు ఏమీ లేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే స్పందించి, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా సహకారదర్శి వెంకటేష్, జిల్లా కోశాధికారి మహేష్, నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment