ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
-నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్.
నారాయణపేట, జూలై28, తెలంగాణజ్యోతి: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు. ప్రాధాన్యతనిస్తూ వెంట వెంటనే పరిష్కరిం చాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 46 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుం డి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండ ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరిం చాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.