కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్‌కు ఘన సన్మానం

కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్‌కు ఘన సన్మానం

కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్‌కు ఘన సన్మానం

– కిరాణా వర్తక సంఘం సభ్యుల శుభాకాంక్షలు

కాటారం, జూలై 28, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లా కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన కాటారం మాజీ ఎంపీపీ పంతకాని తిరుమల సమ్మయ్యను కాటారం మండల కిరాణా వర్తక సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు శాలువా కప్పి, పూల బొకే అందజేశారు. అనంతరం స్వీట్స్ తినిపించి హర్షాతిరేకాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు కలికోట శ్రీనివాస్ మాట్లాడుతూ సమ్మయ్య మరిన్ని పదవుల బాధ్యతలు చేపట్టి ప్రజాసేవలో రాణించాలని ఆకాంక్షించారు. కాటారం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం ఆయన కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా మార్కెట్ కమిటీ కార్యాలయం, గోదాములు, అలాగే ప్రభుత్వం కేటాయించిన భూములను కబ్జాల నుంచి రక్షించి, మార్కెట్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంద న్నారు. ఇందులో భాగంగా, కాటారం డివిజన్‌లోని ఐదు మండలాల రైతులకు మేలు చేకూరే విధంగా కోల్డ్ స్టోరేజ్ ప్యాక్టరీలు ఏర్పాటు చేయాలని చైర్మన్‌కు విన్నవించారు. రైతులకు సరైన ధర లభించేలా వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు అనువైన వసతులు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రత్న రవి, గౌరవ అధ్యక్షుడు గంగిరెడ్డి లచ్చిరెడ్డి, ఉపాధ్యక్షుడు కట్ల రాజయ్య, బీరెల్లి రమేష్, శాన్వి సూపర్ మార్కెట్ రాజు, వంశీ, అల్లాడి ఓం ప్రకాష్, అల్లాడి కిరణ్ కుమార్, రమేష్, దారం నంద కిషోర్, బాసాని రవి, ఎస్ మార్ట్ రవి, చిట్టూరీ శ్రీనివాస్, ముక్క శ్రీనివాస్, ఉప్పల గోవర్ధన్, దారం నాగేష్ కుమార్, సంతోషం ప్రవీణ్ రెడ్డి, శెనిగరం మల్లారెడ్డి, చీర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment