మోడెం వంశీకి రూ.75 వేల ఆర్థిక సహాయం చేసిన బిఆర్ఎస్ నాయకులు
వెంకటాపురం, జూలై 28, తెలంగాణ జ్యోతి : పవర్ లిఫ్టింగ్ లో భారతదేశాన్ని ప్రతినిధ్యం వహిస్తూ నార్త్ అమెరికా పోటీలకు ఎంపికైన ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన మోడెం వంశీకి బి ఆర్ ఎస్ నాయకులు రూ.75 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ అంతర్జాతీయ ప్రయాణానికి రూ.3 నుండి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుండగా ఆర్థికంగా వెనుకబడిన వంశీకి సహాయం అవసరమైంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకలమర్రి లక్ష్మీనరసింహారావు రూ.25 వేలు, మాజీ నూగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రూ.50 వేలు ఆర్థిక సహాయం చేశారు. భవిష్యత్తులో అవసరమైనంతవరకు పూర్తి సపోర్ట్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వాజేడు మండల అధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణ రెడ్డి, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మోడిగ తిరుపతి యాదవ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చెన్నం సాంబశివరావు, నాయకులు మోడెం ప్రకాష్, మోడెం నాగరాజు, యూత్ నాయకులు బోదేబోయిన మనోవికాస్, వేములవాడ వేణు, పరిశిక రామకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.