ప్రతిపక్ష నాయకుని మెప్పుకోసమే స్థానిక బిఆర్ఎస్ నాయకుల ఆరాటం
– విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు
కాటారం, జూలై 27, తెలంగాణ జ్యోతి : మంథని మాజీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు పుట్ట మధుకర్ దగ్గర తమ ఉనికిని కాపాడుకునేందుకే స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరాటపడుతున్నారని కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదినం రోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొని పేద కుటుంబానికి సహాయం చేయడం అంతవరకు బాగానే ఉంది, కానీ మీ నాయకుడు పుట్ట మధు ఏ కార్యక్రమం చేపట్టిన మా నాయకులు మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు లను విమర్శించడానికి ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నరని ఆరోపించారు. ఆ వేదిక కోసం మీ నాయకుడు ఎంతగా దిగజారుతున్నాడో మంథని నియోజకవర్గ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు మా నాయకుల పేరు తీయనిదే మీ నాయకునికి పూట గడవదు,అలాంటి నాయకూని దగ్గర మీరు మీ ఉనికి కాపాడుకునేందుకు మా నాయకుడి మీద చిల్లర మాటలు మాట్లాడుతున్నరని అన్నారు. మీ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది ఆనాడు మీ పార్టీ మేనిఫెస్టోలో ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి మరియు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కారు, గెలిచిన అనంతరం వాటి ఊసే లేకుండా పోయింది,కమిషన్లు వచ్చే ప్రాజెక్టుల మీద దృష్టి సాధించారు. ఆనాడు మీరు ఇస్తానన్న భూమి మరియు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఆ దళిత కుటుంబానికి ఇస్తే సహాయం ఆశించకపోవును కదా అన్నారు. ప్రభుత్వంలో ఉండి ఏం చేయక మా శ్రీధర్ బాబు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి తను రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదని మతి భ్రమించి ఏ వేదిక దొరికిన అక్కడ మా నాయకుడి మీద సంస్కారహీనంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు, మా నాయకుడు చేసినవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక రోజు చాలదు మేము ఒక చేతితో సహాయం చేస్తే రెండో చేతికి తెలియకుండా చేస్తాం మీ నాయకుడు పదిమందితో కలిసి ఒకరికి సాయం చేసి వంద మందికి చేసినట్టు ప్రచారం చేసుకునే చరిత్ర మీది, మరోసారి మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు లపై,మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక మీదట ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అంగజాల అశోక్ కుమార్, పసుల మొగిలి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.