వెంకటాపురం సి.ఐ.గా ముత్యం రమేష్
– మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసిన కాంగ్రెస్ నాయకులు.
వెంకటాపురం, జులై 27, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ముత్యం రమేష్ ఆదివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన, సీఐ ముత్యం రమేష్ ను నూగూరు వెంకటాపురం మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొసైటీ చైర్మన్ చిడెం మోహన్ రావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మన్యం సునీల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడెం సాంబశివరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, సొసైటీ డైరెక్టర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పల్నాటి ప్రకాష్ రావు,మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ రాముల రమేష్, కాంట్రాక్టర్ సల్లూరి ఎల్లయ్య తదితరులు నూతన సీ.ఐ. ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.