పుట్ట మధు వి స్వార్ధం కోసమే సహాయాలు

పుట్ట మధు వి స్వార్ధం కోసమే సహాయాలు

పుట్ట మధు వి స్వార్ధం కోసమే సహాయాలు

– ఈత గింజంత చేసి తాటి గింజంత చెప్పుకోవడం సిగ్గుచేటు

– మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు విమర్శలు

కాటారం, జూలై 25, తెలంగాణ జ్యోతి :  పుట్ట మధు కేవలం స్వార్ధం కోసమే సాయాలు చేస్తున్నారని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో విమర్శించారు. నిన్న కేటీఆర్ పుట్టిన రోజున గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ఎస్సీ,ఎస్టీ,బీసీ నాయకుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి పుట్ట మధు కాటారం మండలం లోని నిరుపేద ఎంబీబీఎస్ విద్యార్థినికి సహాయం చేసి మంత్రి శ్రీధర్ బాబు,శ్రీను బాబుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మంథని ప్రజలు నిన్ను నమ్మి నీ మోసపూరిత హామీలతో గెలిచి మీ పార్టీ 10 సంవత్సరాలు అధికారం లో ఉండి ఎ ఒక్క నిరుపేద కుటుంబానికి సహాయం చేయకుండా, నేడు కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన అనంతరం మా నాయకుడు రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్నత స్థానం లో ఉండి మంథని నియోజక వర్గాన్ని అభివృద్ధి బాటలో నిలుపుతున్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మీద అసంస్కారంగా మాట్లాడటం సరికాదని,మా నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు కి వారి తాతల కాలం నుండే కొన్ని వందల ఎకరాలు పేద దళిత కుటుంబాలకు దానం చేశారని,వారు కుడి చేతితో సహాయం చేస్తే ఎడమ చేతికి తెలియదని,మీరు ఈత గింజంత చేసి తాటి గింజంత చెప్పుకోవడం సిగ్గుచేటని,గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి మన ప్రాంత ప్రజల శ్రేయస్సుని గాలికి వదిలేసి వేల ఆస్తులను అక్రమంగా సంపాదించుకొని నేడు చిలుక పలుకులు పలకడం విడ్డూరంగా ఉందని అన్నారు, మాట మాటికి స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు గురించి సంస్కారహీనంగా ఆరోపణలు చేయడం,నీ రాజకీయ ప్రస్థానం లో శ్రీపాద రావు వెంట ఉండి రాజకీయ ఓనమాలు నేర్చుకొని వారి అకాలమరణం తర్వాత నీ స్వార్ధ రాజకీయాల కోసం ఆ మహా నాయకుని గురించి ఇష్టాను సారంగా మాట్లాడటం సరికదాని,పేద బిడ్డనని అటుకులు తింటూ బ్రతుకుతున్న అని చెప్పుకొని ఎమ్మెల్యేగా గెలిచి కోట్లతో కోటలు కట్టుకున్నావని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శిం చారు. నేడు ఎంబీబీఎస్ విద్యార్థినికి సహాయం చేస్తున్నాను అని చెప్పి మా మండలానికి చెందిన మా దళిత నాయకులతో సహాయం చేపిస్తున్నావు,ఇది కేవలం మీ రాజకీయ ఉనికి కాపాడుకునేందుకే ఈ చిల్లర రాజకీయాలు,మరొక్కసారి మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు ల గురించి అజాత శత్రువు స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు మీద అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment