వెంకటాపురంలో జూలై 27న ఆదివాసి సంఘాల విస్తృత సమావేశం

వెంకటాపురంలో జూలై 27న ఆదివాసి సంఘాల విస్తృత సమావేశం

వెంకటాపురంలో జూలై 27న ఆదివాసి సంఘాల విస్తృత సమావేశం

వెంకటాపురం, జూలై 25, తెలంగాణ జ్యోతి : ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని (ఆగస్టు 9) పురస్కరించుకొని ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో జూలై 27న ఉదయం 11 గంటలకు ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఆర్&బి గెస్ట్ హౌస్‌లో జరగనున్న ఈ సమావేశంలో ఆదివాసి సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, పీసా సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొననున్నట్లు ఆదివాసీ సంఘం నాయకులు పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు, అజెండా అంశాలపై చర్చ జరగనుంది. ఈ కార్యక్రమంలో పూనేం రామచంద్రరావు, చింత సోమరాజు, పర్షిక సతీష్, రేగ గణేష్, కనితి వెంకటకృష్ణ, తాటి లక్ష్మణరావు తదితరులు పాల్గొననున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment