గొంతెమ్మ గుట్ట అభివృద్ధికి డి.ఎఫ్.ఓ. నవీన్ రెడ్డి ప్రత్యేక చర్యలు

గొంతెమ్మ గుట్ట అభివృద్ధికి డి.ఎఫ్.ఓ. నవీన్ రెడ్డి ప్రత్యేక చర్యలు

గొంతెమ్మ గుట్ట అభివృద్ధికి డి.ఎఫ్.ఓ. నవీన్ రెడ్డి ప్రత్యేక చర్యలు

కాటారం, జులై 25, తెలంగాణ జ్యోతి : కాటారం మండలం ప్రతాపగిరి పంచాయతీ పరిధిలో గల గొంతెమ్మ గుట్టకు పర్యాటకులు వచ్చేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు భూపాలపల్లి జిల్లా అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వర్షంను లెక్కచేయకుండా మర్రిపెళ్లి నుండి గొంతెమ్మ గుట్టకు అటవీశాఖ ఉద్యోగులతో కలిసి కాలినడకన వెళ్లారు. రాబోయే గొంతెమ్మ గుట్ట జాతర వరకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించనున్నట్లు తెలిపారు. ఏమేం అభివృద్ధి పనులు చేయాలో అధికారులతో కలిసి చర్చించారు. మర్రిపెళ్లి గ్రామం నుండి గొంతెమ్మ గుట్ట పై వరకు భక్తులు సౌకర్యంగా నడిచి వెళ్లేలా మెట్ల నిర్మాణం, చిన్న వాగులపై పైపుల తో కల్వర్టు ల నిర్మాణం, సోలార్ సిస్టం బోరువెల్ వేసి మంచినీటి సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎఫ్ డీ ఓ సందీప్ రెడ్డి , ఎఫ్ ఆర్ ఓ స్వాతి, డి ఆర్ ఓ సురేందర్ నాయక్, ఎఫ్ బి ఓ రాజేందర్, ఎఫ్ ఎస్ ఓ లు చంద్రశేఖర్, అర్చన , ఎఫ్ బి ఓ లు సంజీవ్, మోయినొద్దీన్, అశోక్,అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment