విస్తృతంగా వాహనాల తనిఖీలు

విస్తృతంగా వాహనాల తనిఖీలు

విస్తృతంగా వాహనాల తనిఖీలు

వెంకటాపురం, జులై 25, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు  వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిపై శుక్రవారం వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈనెల 28 వ తేదీ నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా వెంకటాపురం మండలం లోని బోదాపురం,తిప్పాపురం క్రాస్ రోడ్స్ ప్రధాన రహదారిపై వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలను నిర్వహించి అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. ఈ తనిఖీల కార్యక్రమంలో శిక్షణ ఎస్.ఐ.లు సాయి కృష్ణ, తిరుపతిరెడ్డి, ఆలుబాక బేస్ క్యాంపు సిఆర్పిఎఫ్ సిబ్బంది, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment