జిల్లా కేంద్రంలో డివైడర్ ను ఢీకొట్టిన లారీ–తప్పిన ప్రమాదం

జిల్లా కేంద్రంలో డివైడర్ ను ఢీకొట్టిన లారీ–తప్పిన ప్రమాదం

జిల్లా కేంద్రంలో డివైడర్ ను ఢీకొట్టిన లారీ–తప్పిన ప్రమాదం

ములుగు ప్రతినిధి, జూలై 24, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డులో నూతనంగా నిర్మించిన డివైడర్ ను లోడ్ తో వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. బండారుపల్లి నుంచి ములుగు వైపుకు వస్తున్న లారీ ఏకంగా డివైడర్ పైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కు ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే అదే సమయంలో మరో వాహనం వస్తే భారీ ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా లారీని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదాల నివారణకు డ్రైవర్లు రాత్రి సమయాల్లో అత్యంత జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment