– ఆర్బీఎస్కే వైద్యుడు నరహరి
– విద్యార్థులకు వైద్యపరీక్షలు
ఏటూరునాగారం, జూలై 24, తెలంగాణ జ్యోతి : విద్యార్థులు పౌష్ఠికాహారం తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తీగాలని ఆర్బీఎస్కే వైద్యుడు డాక్టర్ బొప్పరాతి నరహరి సూచించారు. గురువారం వైద్య ఆరోగ్య శాఖ, ఆర్బీఎస్కే బృందం ఆధ్వర్యంలో ఏటూరునాగారంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రక్తహీనతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరహరి మాట్లాడుతూ విద్యార్థులు ఎత్తుకు తగ్గట్లుగా బరువు ఉండాలని, హాస్టల్ లో అందించే పోషకాహారం తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిం చాలని సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో విద్యార్థుల ఎత్తు, బరువు, రక్తపరీక్షలు నిర్వహించి రక్తహీనత (అనీమియా) ఉన్నవారిని గుర్తించారు. రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఫార్మసిస్టు బాస్కర్,పాఠశాల టీచర్లు శంకరమ్మ,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.