గుడుంబా విక్రయాలపై పోలీసుల దాడి

గుడుంబా విక్రయాలపై పోలీసుల దాడి

గుడుంబా విక్రయాలపై పోలీసుల దాడి

– ఆరుగురు బైండోవర్

కన్నాయిగూడెం, జూలై 24, తెలంగాణ జ్యోతి : గుడుంబా తయారీ, విక్రయంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణ, సునార్కని సత్యం, సుధాకర్, సంతోష్, దుర్గం మహేందర్, అసరెలి రవిలపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. వీరు రోజువారీగా గుడుంబా కాస్తు, సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం నిందితులను మండల తహసిల్దార్ ఎదుట హాజరు పరిచామ న్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలా పాలకు పాల్పడితే 6 నెలల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించేలా బైండోవర్ పత్రాలు ఎంఆర్వోకు సమర్పించామని తెలిపారు. నిందితులను మంచి ప్రవర్తన కోసమని బైండోవర్ చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment