ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
-యుయస్పిసి నాయకులు పోడెం సమ్మయ్య, పల్లె నాగరాజు
కన్నాయిగూడెం, జులై24, తెలంగాణ జ్యోతి : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు పోడెం సమ్మయ్య, పల్లె నాగరాజు కోరారు. బుధవారం చేపట్టిన మూడు దశల ఉద్యమంలో భాగంగా గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.19నెలలు గడిచినా బదిలీలు, ప్రమోషన్లు పూర్తవక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల చివరిలోగా షెడ్యూల్ విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యా యులు, పెన్షనర్ల బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలకు 5571 హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలని, అర్హత కలిగిన ఎస్జీటీలకు హెచ్ఎం ప్రమోషన్ కల్పించాలని కోరారు. అలాగే గురుకులాల టైమ్‌టేబుల్ సవరణ, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరి ఈ కార్యక్రమంలో వంగ పాపయ్య, వి.శ్యామ్ సుందర్, బి.కోటి, పి.శివరామకృష్ణ, ఎమ్. చిట్టి బాబు పాల్గొన్నారు.