ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయాలి

ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయాలి

ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయాలి

– ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ

ములుగు ప్రతినిధి, జులై 23, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆగస్టు 13న హైదరాబాద్ లో నిర్వహించనున్న వికలాంగులు, పింఛన్ దారులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, పేద వర్గాల మహాగర్జన సభ సన్నాహక సమావేశం వీహెచ్పీఎస్ రాష్ట్ర నాయకుడు మంచోజు చంద్రమౌళి అధ్యక్షతన బుధవారం ములుగులోని డీఎల్ఆర్ గార్డెన్స్ లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తై 18నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. రెండేళ్లుగా ఐదులక్షల పింఛన్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమం ఎవరికీ వ్యతిరేకం కాదని, పేదల హక్కుల కోసం జరుగుతోందని, ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆగస్టు 13న నిర్వహించే సభను అన్నివర్గాల ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్యార్పీఎస్ జిల్లా ఇన్చార్జిలు చాతల రమేష్, తడుగుల విజయ్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి శ్యాంబాబు, నాయకులు వావిలాల స్వామి, ఎంపెల్లి శంకర్, కల్లెపల్లి రమేష్, గజ్జల ప్రసాద్, నెమలి నర్సయ్య, మరాఠి రవీందర్, కార్తీక్, జాషువా, వీహెచ్పీఎస్ నాయకులు దేవేందర్, సుజాత, రవి, రాజు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయాలి

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment