బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి

బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి

బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి

ఏటూరునాగారం,జూలై23,తెలంగాణజ్యోతి:  మండల పరిధి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న ధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ డబ్బులు ఇప్పటివరకు చెల్లించకపోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షుడు వడకాపురం సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గత యాసంగి సీజన్‌లో ధాన్యం విక్రయించి మూడునెలలు గడుస్తున్నా రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వరి నారులు సాగుతున్నప్పటికీ పెట్టుబడి ఖర్చులు, కూలీల జీతాలు, ఎరువులు, మందులు మొదలైన అవసరాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బోనస్ చెల్లించకపోతే రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎండి యాకూబ్, యానాల నరసన్న, తుమ్మల రామన్న, దుబ్బాక రాకేష్, సుంకరి సుధాకర్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment