వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బదిలీ
– నూతన సీఐగా ముత్యాల రమేష్
వెంకటాపురం, జులై 22, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా అసిఫాబాద్ జిల్లా కౌటాల సర్కిల్ సీ.ఐ.గా విధులు నిర్వహిస్తున్న ముత్యాల రమేష్ ను వెంకటాపురం సి.ఐ గా నియమిస్తూ ములుగు జిల్లా ఎస్పీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు వెంకటాపురం సి.ఐ.గా పనిచేసిన బండారు కుమార్ ను హైదరాబాద్ ఐజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.