జీవో 49 అబేయన్స్‌లో పెట్టిన ప్రభుత్వం
– ఆదివాసీలకు భరోసా
హైదరాబాద్, జులై 21, తెలంగాణ జ్యోతి : జీవో 49 పై ఆదివాసీల్లో నెలకొన్న అనుమానాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, జీవో 49ను అబేయన్స్‌లో పెడుతూ అటవీ శాఖ అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క సంయుక్తంగా ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 330 ప్రభావిత గ్రామాలకు సంబంధించిన సమస్యలపై సమగ్ర సమాచారం సేకరించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కవ్వాల్ టైగర్ కారిడార్‌పై జారీ చేసిన జీవో 49పై ఆదివాసీలకు భయం లేకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు.