శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత
భూపాలపల్లి, జూలై 21, తెలంగాణ జ్యోతి : సమాజంలో శాంతి భద్రతలు, చట్టవ్యవస్థ పటిష్టంగా ఉండేలా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం గోరి కొత్తపల్లి మండలంలో నూతనంగా నిర్మితమైన పోలీస్ స్టేషన్ను భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జరిగిన సభలో మాట్లాడారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేం దుకు గోరి కొత్తపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటైనందుకు మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇది స్థానిక ప్రజలకు రక్షణకు భాసటగా నిలుస్తుందని పేర్కొన్నారు.