వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం
కన్నాయిగూడెం, జులై21, తెలంగాణ జ్యోతి : వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం మారుమూల గిరిజన ప్రాంతమైన భూపతిపూర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పరిశుభ్రత గురించి, నీటిని వేడి చేసుకొని తాగాలని, దోమ తెరలు వాడకం, సీజనల్ వ్యాధుల పట్ల గురించి వివరించారు. ఈ వైద్య శిబిరంలో 78 మందికి ఉచితంగా మందులు అందించారు. ఈకార్యక్రమంలో డాక్టర్ అశోక్, జగదీష్, కన్నాయి గూడెం మండల మార్కెట్ కమిటీ అధ్యక్షుడు చర్ప పగడయ్యా, మాజీ ఏంపిటిసి ఆలం నర్సక్క, రాంబాబు, మాజీ సర్పంచ్ చర్ప కమల, సమ్మయ్య, చర్ప కుటుంబరావు, చిరంజీవి, చర్ప నర్సింగరావు, ఆకుతోట మధుకర్, సంజీవ్ పటేల్, కుందారపు తరుణ్, తదితరులు పాల్గొన్నారు.