గోరింటాకు రంగుల్లో ఆడపడుచుల ఆనందం
ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు
కాటారం, జూలై 20, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఆదివారం అయ్యప్ప దేవాలయంలో మహిళలు గోరింటాకు వేడుకలు నిర్వహించారు. మండల ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు చేశారు.మహిళలందరూ సమావేశంలో ఇంటి నుండి తెచ్చుకున్న గోరింటాకు మహిళలు తమ చేతులకు అందంగా అలంకరించుకున్నారు. చేతులకు అలంకరించిన గోరింటాకును ఒకరికొకరు చూపించుకుంటూ బాగున్నవారికి ప్రశంసలు ఇచ్చారు. మహిళలకు ఆధ్యాత్మికతతో పాటు ఆనందం పంచే మాసం ఆషాడం ఈ మాసంలో లభించే గోరింటాకు అంటే మహిళలు ఎంతో మాకు చూపుతారు గోరింటాకు పెట్టుకోవడం వెనుక పలు శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో గోరింటాకు పెట్టుకుంటే చర్మవ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని అభిప్రాయం ఉంది గోరింటాకు మందారం లా పండితే మంచి భర్త దొరుకుతాడని అదే వివాహితలైతే వారి కడుపు పండుతుందని కాపురం చక్కగా ఉంటుందని పెద్దవాళ్లు అంటుంటారు ఈ నమ్మకాలు ఎలా ఉన్నా గోరింటాకును శుభానికి చిహ్నంగా భావిస్తారు గోరింటాకుతో ఎర్రగా పండిన చేతులను భర్తకు చూపిస్తూ మహిళలు మురిసిపోతుంటారు. గ్రామాల్లో సామూహికంగా మహిళలు గోరింటాకును గ్రైండ్ చేసి అందరూ ఒకే చోట సమావేశమై పాటలు పాడుతూ ముచ్చట్లు పెడుతూ ఒకరికొకరు పెట్టుకున్నారు.
మండలం మహిళా సంఘం నూతన కమిటీ ఎన్నిక
కాటారం మండల ఆర్యవైశ్య మహిళా సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా మద్ది నీరజ, ప్రధాన కార్యదర్శిగా చందా శోభరాణి, కోశాధికారిగా బీరెల్లి పావని లు ఎన్నికైనట్లు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మద్ది నవీన్ కుమార్ తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి మహిళలు శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మద్ది నీరజ, చందా శోభారాణి, పవిత్రం నిర్మల,బచ్చు మధుమతి, మద్ది శ్రీదేవి, కలికోట కల్పన, బచ్చు ప్రేమలత, వోల్లాల మాధవి, సామ స్వరూప,దారం రమాదేవి భీమారపు పద్మ, తోట శైలజ, నరిసిన రాజశ్రీ, పుల్లూరి రాధిక పాల్గొన్నారు.