అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులచే ఘనంగా బోనాల పండుగ
వెంకటాపూర్, జులై 20, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామంలో ఆదివారం విద్యార్థులచే అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులతో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ కొండ మాధవి మాట్లాడుతూ తెలంగాణలోనే ఎంతో అంగరంగ వైభవంగా బోనాల పండుగ నిర్వహిస్తామన్నారు. ఈ బోనాల వేడుకలలో విద్యార్థులు బోనాలను ఎత్తుకొని ఆటపాటలు నృత్యాలతో ఘనంగా నిర్వహించమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు