వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కార్పొరేటివ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా పవిత్రం శ్రీనివాస్
కాటారం, జూలై 20, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన పవిత్రం శ్రీనివాస్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కార్పొరేటివ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఈ నియామకం ఆదివారం రాజమండ్రి లో నిర్వహించిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అర్థ వార్షిక సమావేశంలో జరిగింది. అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ శ్రీనివాస్‌ను ఈ పదవికి నియమిస్తూ ప్రకటించారు. వాసవి క్లబ్‌లో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించి ఈ ప్రమోషన్‌ను ప్రకటించారు. కాళేశ్వరం వద్ద మే నెలలో జరిగిన సరస్వతీ నది పుష్కరాలlo నిర్వహించిన మహన్నదానం కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపినందుకు ఆయనకు ‘వెండి మెమెంటో’ తో సన్మానం చేశారు. ఈ ఘనతకు మండల ఆర్యవైశ్యులు, వాసవి క్లబ్ నాయకులు శ్రీనివాస్‌కు హార్దిక అభినందనలు తెలిపారు.