టేకులగూడెం బోడగుట్ట వద్ద లారీ ప్రమాదం
వెంకటాపురం, జూలై 20, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం వద్ద, చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న బోడగుట్ట ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం ఓ లారీ ప్రమాదానికి గురైన సంఘటన చోటు చేసుకుంది. చత్తీస్‌గఢ్ వైపు నుంచి ఐరన్ లోడ్‌తో వస్తున్న లారీ, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి కొండ కిందికి దూసుకు పోయింది. అయితే అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ లారీ క్యాబిన్ నుండి దూకడంతో వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ బండరాయిని తాకడంతో బోల్తా కొట్టకుండా అక్కడే నిలిచి పోయింది. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.