విద్యుత్ షాక్‌తో మేక మృతి
ఏటూరునాగారం, జూలై18, తెలంగాణజ్యోతి : మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌తో మేక మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు యాదవ రెడ్డి పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని సమాచారం. ఈ సమయంలో పక్కనే ఉన్న పామాయిల్ తోట లోకి మేకలు వెళ్లగా, అకస్మాత్తుగా విద్యుత్ లైన్ లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మేక ఒక్కసారిగా కుప్పకూలి చని పోయింది. ఈ ఘటనపై చుట్టుపక్కల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ ప్రమాదం మనుషులకు జరిగి ఉంటే ప్రాణ నష్టం తప్పేది కాదంటూ” వారు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి షార్ట్ సర్క్యూట్ సమస్యను పరిష్కరించి, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. మృత మేక విలువ సుమారు రూ. 14 వేలు ఉంటుందని మేక యజమాని బైరెడ్డి రామిరెడ్డి తెలిపారు.