వెంకటాపురం మండలంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ
వెంకటాపురం, జూలై 18, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ప్రజాపాలన–ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించను న్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేయనున్నట్లు తహసీల్దార్ వేణుగోపాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వెంకటాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న కార్యక్రమం లో లబ్ధిదారులు, ప్రజలు, స్థానిక రాజకీయ నాయకులు, సంఘాల ప్రతినిధులు, మీడియాసభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ వేణుగోపాల్ కోరారు.