రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కాటారం, జూలై 18, (తెలంగాణ జ్యోతి) : ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన మేరకు యూరియా సరఫరా చేయాలని యూరియా కోసం రైతులు క్యూ లైన్ లలో నిలబడి తీసుకునే పరిస్థితులు వచ్చాయని మంథని బి.ఆర్.ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. కాటారం మండలంలో పలు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. శుక్రవారం కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కోసం క్యూలైన్లో నిల్చున్న రైతులతో మాట్లాడారు. రెండు మూడు రోజులుగా యూరియా కోసం లైన్లో నిల్చుంటున్నామని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారరని పుట్ట మధు అన్నారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలను, సమస్యలను ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు చెప్పినా స్పందించడం లేదన్నారు. ఇంత పెద్ద సమాజంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు మూడు ఓట్లు ఉన్న మీ కుటుంబాన్ని అనేక మార్లు ఆదరించి అవకాశం కల్పించినా మా గురించి ఆలోచన చేయడం లేదని చెప్తన్నా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు, ఎప్పుడుఓట్లు వచ్చినా కాటారం మండల ప్రజలకు దుద్దిళ్ల కుటుంబానికి వేలలో మెజార్టీ ఇస్తున్నారని, మెజార్టీ ఇచ్చే కాటారం ప్రజల గోస మంత్రికి పట్టదా అని ఆయన ప్రశ్నించారు. అధికారం, మంత్రి పదవి వచ్చేందుకు కారణమైన కాటారం ప్రజల గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదన్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడం మూలంగా ఇంకా పూర్తి స్థాయిలో వరి నాట్లు కాలేదని, ఈ సమయంలోనే రైతులు ఇలా క్యూలైన్లలో రోజుల తరబడి నిలబడితే నాట్లు పూర్తి అయితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందోమంత్రి ఆలోచన చేయాలన్నారు. దేశంలో తమ కుటుంబానికే కోట్లు సంపాదించుకుని ప్రజలను గాలికివదిలేసే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం మంథని ఎమ్మెల్యే అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సీజన్లో రైతులకు పచ్చిరొట్టే విత్తనాలు, పప్పు దినుసుల విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, మంథని ఎమ్మెల్యే స్పందించి వరినాట్లు పూర్తయే సమయానికి రైతులకు సరిపడా యూరియను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జక్కు రాకేష్, జోడు శ్రీనివాస్, వూర వెంకటాశ్వరరావు, పంతకాని సడవలి,గాలి సాడవళి, జక్కు శ్రావణ్, ఉప్పు సంతోష్, ధన్వాడ మాజీ సర్పంచ్ తోంబర్ల వెంకట రమణ, అత్కూరి బాలరాజు, మానేమ్ రాజాబాపు, కొడపర్తి రవి, పైడకుల మహేందర్,వేములవాడ రాజబాబు, బొడ్డు సుధాకర్, చక్రి, తుటి మనోహర్ బోడతిరుపతి, సకినాల ప్రశాంత్, పాగే రజకర్, జిమ్ముడా వంశీ ఎండీ జమీర్ కాటారపు రాజమౌగిలి, సిరాజ్, తోట సతీష్,ఓదెల చంద్రయ్య బొబ్బిలి వినోద్ పాల్గోన్నారు.