అడవుల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
– సి. సి. ఎఫ్. డాక్టర్ బి. ప్రభాకర్
వెంకటాపురం,జులై18, తెలంగాణజ్యోతి : అడవుల సంరక్షణ లో నిర్లక్ష్యం వహించిన, విది నిర్వహణలో అలసత్వం వహించిన సహించేది లేదని, కాలేశ్వరం జోన్ సి. సి. ఎఫ్. డాక్టర్ బి. ప్రభాకర్ అన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం ఎఫ్.డి.ఓ కార్యాలయం ఆవరణలో శుక్రవారం వాజేడు, వెంకటాపురం, దూలాపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ సిబ్బందితో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎఫ్ ఓ రాహుల్ జాదవ్, వెంకటాపురం ఎఫ్డిఓ జి.ద్వాలియా పాల్గొన్నారు. సి.సి.ఎఫ్ డాక్టర్ బి. ప్రభాకర్ సమావేశంలో మాట్లాడుతూ అడవులను నరకటం, కలప స్లంగ్లింగ్,వన్యం ప్రాణుల సంరక్షణతో పాటు అటవీ సంరక్షణ చట్టాలు పకడ్బందీ గా అమలు పరచాలని ఆదేశించారు. వన మహోత్సవాల సందర్భంగా ప్రజల భాగస్వామ్యంతో మొక్కల నాటే ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆదేశించారు. నర్సరీల ద్వారా మొక్కలు స్థానిక సంస్థలకు, సంఘాలకు, స్వచ్ఛంద సంస్థలకు, పాఠశాలలకు, కళాశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, గృహస్తులకు సరఫరా చేయాలని ఆదేశించారు. వెంకటాపురం ఫారెస్ట్ డివిజన్లో అటవి శాఖ అనుమతి పొందిన వాటర్ ఫాల్స్ కు పర్యటకులకు అనుమతులు ఇవ్వాలని, అనుమతులు లేని వాటర్ ఫాల్స్ కు పర్యటకుల నిషేధమని, వాటర్ ఫాల్స్ వద్ద ప్రమాదాలు జరక్కుండా డ్యూటీ సిబ్బంది విదులు నిర్వహించా లని ఆదేశించారు. అనంతరం వెంకటాపురం మండల కేంద్రం లోని కాపెడ్ సంస్థ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల వద్ద సి సి ఎఫ్ డాక్టర్ బి ప్రభాకర్, డీఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఫారెస్ట్ అధికారు లు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వాజేడు, దూలా పురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి. చంద్రమౌళి, దూలాపురం రేంజ్ ఆఫీసర్, కే.బాలకృష్ణ, మూడు రేంజీల సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.