కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం

– రాష్ట్ర మంత్రి సీతక్క

– ఇందిర మహిళా శక్తి సంబురాల్లో మహిళల సాధికారతపై మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు కీలక ప్రకటనలు

భూపాలపల్లి, జూలై 18, తెలంగాణ జ్యోతి : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ఫ్ ఆధ్వర్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధ్యక్షతన నిర్వహించిన ఇందిర మహిళా శక్తి సంబురాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు  మహిళలు సరికొత్త ఆలోచనలతో నూతన వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి చెందాలని సీతక్క సూచించారు. మహిళా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు, మహిళ మరణిస్తే రూ.10 లక్షల ఆర్థిక సాయం, రెండు రుణాల మాఫీ వంటి పథకాలతో ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. శిల్పారామంలో రూ.300 కోట్లతో మహిళల తయారీ ఉత్పత్తుల విక్రయానికి స్టాళ్లు, ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు, అమ్మ చేతి వంటకు గుర్తింపు, మహిళలకే ఇళ్ల యజమానిత్వ హక్కులు, మిల్లులు, గోదాంలు, పెట్రోల్ బంకులు, కోళ్ల ఫామ్‌లు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సుల ద్వారా వివిధ ఆదాయ మార్గాలు కల్పిస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 67 లక్షల మహిళలు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, అర్హులైన ప్రతి ఒక్కరు సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అంటే ఆడబిడ్డల ప్రభుత్వం అని, కొత్త ప్రభుత్వ ఏర్పాటయ్యాక 18 నెలల్లో మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక కార్యాచరణలు చేపట్టామని, మండలానికి ఒక్కో బస్సు, నైనిపాకలో సోలార్ విద్యుత్ ప్లాంట్, పెట్రోల్ బంకులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ కవర్ రూ.10 లక్షలకు పెంపు, ఇళ్లకు ఉచిత విద్యుత్, గృహజ్యోతి ద్వారా రూ.280 కోట్ల బిల్లులు చెల్లించామని తెలిపారు. నియోజకవర్గంలో 6700 మందికి సీఎం రిలీఫ్ ఫండ్, 1100 మందికి ఉచిత వైద్య సేవలు, విద్యావంతులకు ఉద్యోగాలు, పేదలకు సన్న బియ్యం, రైతులకు బోనస్, గాంధీనగర్ వద్ద ఇంటిగ్రేటెడ్ మోడల్ పాఠశాల, వరదల సమయంలో మరణించిన 1196 మందికి పరిహారం, తెగిన చెరువులకు రూ.30.70 కోట్లతో మరమ్మతులు చేసినట్లు వివరించారు. జిల్లాలో ఇసుక దందాకు చెక్ పెడుతూ ప్రజలకు అందుబాటులో ఇసుకను తీసుకొచ్చామని, 6.60 కోట్లతో ఎంపిడిఓ కార్యాలయాలు, 100 కోట్లతో రహదారుల మరమ్మతులు, 5.50 కోట్లతో జిల్లా సమాఖ్య భవనం నిర్మాణం చేపట్టామని చెప్పారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో మహిళల సాధికారత కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఆదర్శ పాఠశాల కమిటీలు, యూనిఫాం కుట్టు పనులు, 6 ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు, మొబైల్ చేపల విక్రయ వాహనాలు, చెల్పూర్‌లో మిల్లెట్ యూనిట్ వంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సెర్ఫ్ డైరెక్టర్ రజని, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డిఆర్డీఓ బాలకృష్ణ, ఆర్డీఓ రవి, ఎంపిడిఓ జయశ్రీ, తహసీల్దార్ ఇమామ్ పాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment