ఆలయాల అభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేస్తా
– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ
– సీజీఎఫ్ నిధులతో శంకుస్థాపనలు – ప్రజా ప్రభుత్వ నిబద్ధతకు ప్రతిరూపం
భూపాలపల్లి, జూలై 18, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి దేవాలయం అభివృద్ధి అభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఆజంనగర్, గొల్ల బుద్దారం గ్రామాల్లో పర్యటించారు. ఆజంనగర్ గ్రామంలోని శ్రీ శివ కేశవస్వామి ఆలయంలో రూ.10 లక్షల సీజీఎఫ్ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్లబుద్దారం గ్రామంలోని శ్రీ రామాలయంలో రూ.50 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఆలయాలు సామాజిక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నాయి. ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూ వాటి అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తున్నాం,” అని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని చూసి కొందరు మాజీ ప్రజా ప్రతినిధులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని ఆరోపించారు. ఎమ్మెల్యే రామాలయంలో మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణకూ ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు.