భూభారతి చట్ట రూపకర్తకు ఘన సన్మానం
వెంకటాపురం,తెలంగాణ జ్యోతి : తెలంగాణ భూసంస్కరణ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిన భూభారతి చట్ట రూపకర్త, న్యాయ నిపుణుడు భూమి సునీల్ రెడ్డిని హైదరాబాద్ తార్నాకలోని ఆయన స్వగృహంలో మంగళవారం వెంకటాపురం వాస్తవ్యులు, న్యాయవాది మరియు జర్నలిస్టు వాసం నాగరాజు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మిత్రుడు, న్యాయవాది వాసం ఆనంద్ కూడా పాల్గొన్నారు. భూమి అనే ఇంటి పేరును తన అస్తిత్వంగా మార్చుకొని, భూభారతి చట్ట రూపకర్తగా రాష్ట్రానికి విలక్షణ సేవలు అందించిన భూమి సునీల్ రెడ్డి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని వారు అభినందించారు. న్యాయవేత్తగా ఆయన చేసిన కృషి యువ న్యాయవాదులకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు.