షెడ్యూల్డ్ ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలి

షెడ్యూల్డ్ ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలి

షెడ్యూల్డ్ ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలి

– ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్

– ములుగు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత

వెంకటాపురం, జూలై 14, తెలంగాణ జ్యోతి : షెడ్యూల్డ్ ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244 ప్రకారం ఐదవ షెడ్యూల్ చట్టాలు అమలులో ఉండే ప్రాంతాల్లో గవర్నర్ ప్రత్యేక అధికారాలతో పాలనను ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల హక్కులను నిర్లక్ష్యం చేస్తూ, ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేస్తోందని ఆరోపించారు. గిరిజనేతరులకు హక్కులు కల్పించేందుకు కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపురం మండలంలోని ముత్తారం, శాంతినగర్, కలిపాక గ్రామాల్లో ఉన్న రహదారి, కల్వర్టు సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాలను అమలు చేసి, స్థానికుల సమస్యలు పరిష్కరిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తాటి రాంబాబు, మంగపేట మండల అధ్యక్షుడు కుర్షం శివశంకర్, సోడి గోపి, బాడిశ కన్నయ్య, కుర్సం ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment