గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్ట్
ములుగు ప్రతినిధి, జూలై 11, తెలంగాణ జ్యోతి : గట్టమ్మ దేవాలయం సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీలలో గంజాయి తరలిస్తున్న యువకుడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఎస్సై వెంకటేశ్వరరావుతెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌పై ములుగు వైపు వస్తున్న ఒక యువకుడు తనిఖీలు చేస్తున్న పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించా డు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్పందించి అతన్ని వాహనంతో సహా అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా 1 కిలో ఎండుగంజాయి లభ్యమైనట్లు పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తు లో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన యువకుని గా గుర్తించారు. పంచనామా నిర్వహించి గంజాయిని సీజ్ చేసి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. యువకుడు మైనర్ కావడంతో న్యాయ ప్రక్రియల ప్రకారం స్థానిక న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, జూనియర్ హోమ్‌కు తరలించినట్టు ములుగు స్టేషన్‌హౌస్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.