కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న దుద్దిళ్ళ జయమ్మ
మహదేవపూర్, జులై 11, తెలంగాణ జ్యోతి :కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , రాష్ట్ర పీ సి సీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు సోదరుల అమ్మ దుద్దిళ్ళ జయమ్మ, వారి అక్క శ్రీవాణి , అల్లుడు హర్షత్ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు, ఈ సందర్భంగా ఆలయం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయం సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం సరస్వతి ఘాట్ సందర్శించారు, వారితో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు లేతకరి రాజబాబు, మండల ప్రధాన కార్యదర్శి మాడుగుల పవన్ శర్మ, యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు నిట్టూరి నాగేష్, సీనియర్ నాయకులు అమృతం సారయ్య, పాల్గొన్నారు.