ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్, విద్యా సామగ్రి పంపిణీ
ములుగు ప్రతినిధి, జూలై 11, తెలంగాణ జ్యోతి : ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, లయన్ రేవూరి రమణారెడ్డి సహకారంతో ములుగు బాలుర మరియు బాలికల ప్రభుత్వ హై స్కూల్‌లకు స్పోర్ట్స్ మెటీరియల్, ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు, డిక్షనరీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలుర హై స్కూల్‌కు క్రికెట్, వాలీబాల్, షటిల్ రాకెట్‌లు, ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్, డిక్షనరీలు అందించగా, బాలికల హై స్కూల్‌కు రింగ్స్, స్కిప్పింగ్ రోప్స్, చెస్ బోర్డులు, డిక్షనరీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇద్దరు స్కూళ్ల ప్రధానోపాధ్యాయులైన క్యాతం రాజేందర్, ఝాన్సీ లు విద్యార్థుల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా విద్యార్థుల ప్రతిభను మరింత మెరుగుపరిచేందుకు స్పోర్ట్స్ కిట్స్, ఇంగ్లీష్ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమానికి లయన్స్ క్లబ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ దొంతిరెడ్డి శ్రీనివాస్, కార్యదర్శి లయన్ చుంచు రమేష్, లయన్ సానికొమ్మ రవీందర్ రెడ్డి తదితర సభ్యులు, స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.