ప్రెస్ రిపోర్టర్ కర్ని నాగేశ్వరరావు కుటుంబానికి పరామర్శ
- భద్రాచలం ఎమ్మెల్యే పోదెంవీరయ్య
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా, వెంకటాపురం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన ప్రెస్ రిపోర్టర్ కర్ని నాగేశ్వరరావు కుమార్తె కర్ని నిషిత వర్ధిని ఇటీవల అనారోగ్యంతో మరణించగా మంగళవారం సాయంత్రం ఎం.ఎల్.ఎ వీరయ్య వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి వారికి మనోధైర్యం కల్పించారు. రిపోర్టర్ నాగేశ్వరరావు కుటుంబాన్ని ఓదార్చారు. భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ప్రచార కార్యక్రమంలో బిజీ, బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఇన ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రిపోర్టర్ నాగేశ్వరావు కుటుంబాన్ని పరామర్శించి, ఎల్లవేళలా అండ, దండగా ఉంటామని, మనో ధైర్యంతో ముందు కు సాగాలని, భుజం తట్టి అండగా ఉంటామని, ధైర్యం కల్పించారు. భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మేల్యే అభ్యర్థి పోదాం వీరయ్య, మాట్లాడుతూ చిన్నారి వర్దిని అకాల మరణం ఎంతో బాధాకరమని కుటుంభాన్నీ ఒదార్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దుర్గాప్రసాద్, శ్రీను, కుమార్,దాసు, జాడి ముత్తయ్య, పోరిసెట్టి రాజు, ధర్మేందర్, గ్రామస్తులు గుణ్ణం శ్రీనివాసరావు, ముర్రం, సర్వేశ్వరరావు, కుంజా సంతోష్, ఇర్పరాజు, శ్యామల ప్రభాకర్, చిలుకూరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.