చెట్లను నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి …
– శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ ప్రసాద్
భూపాలపల్లి,జూలై8,తెలంగాణజ్యోతి: భూపాలపల్లి పట్టణం లోని శ్రీ చైతన్య పాఠశాలలో “స్మార్ట్ లివింగ్” కార్యక్రమం లో భాగంగా “గ్రీన్ ఇండియా మిషన్” పేరుతో విద్యార్థులచే మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రసాద్ మాట్లాడుతూ అడవులు నరికివేయడం వల్ల గాలి, నీరు, నేల విపరీతంగా కలుషితమవు తున్నాయని, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయన్నారు. అనేక జీవజాతులు నశించే పరిస్థితి ఏర్పడుతోందాని, అందువల్ల ప్రతి ఒక్క విద్యార్థి తన జన్మదినాన్ని పురస్కరిం చుకుని ఓ మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమ అనంతరం పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం చేతన్, కోఆర్డినేటర్ శివ కోటేశ్వరరావు, అకడమిక్ డీన్ స్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.