దొడ్ల కొత్తూరులో వైద్య శిబిరం నిర్వహణ
– వైద్యాధికారి సిహెచ్. ప్రణీత్ ఆధ్వర్యంలో వైద్య సేవలు
ఏటూరునాగారం,జూలై 8,తెలంగాణ జ్యోతి: మండలంలోని కొండాయి, దొడ్ల కొత్తూరు గ్రామాలలో వైద్యాధికారి డా. సిహెచ్. ప్రణీత్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే నిర్వహించి, 45 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. నలుగురికి మలేరియా పరీక్షలు నిర్వహించగా అన్ని నివేదికలు నెగటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. వారికీ అవసరమైన మందులు పంపిణీ చేశారు. ప్రజలు పరిశుభ్రత పాటించాలని, దోమతెరలు వాడాలని సూచించారు. అలాగే తాగునీటిని మరిగించి తాగాలనే సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ భాస్కరరావు, ఏఎన్ఎం సమ్మక్క, ఆశా వర్కర్ సునీత పాల్గొన్నారు.