మంథని ప్రెస్ క్లబ్‌ను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని ప్రెస్ క్లబ్‌ను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని ప్రెస్ క్లబ్‌ను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

– పత్రికా మిత్రుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

కాటారం, జులై 5, తెలంగాణ జ్యోతి : జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం మంథని పట్టణంలో ప్రెస్ క్లబ్‌ను ఆయన సందర్శిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా రాజకీయాలకతీతంగా మంథని ప్రజల శ్రేయస్సు కోసం నిబద్ధతతో పని చేశాను” అని తెలిపారు. మీడియా మిత్రులు ‘ఫోర్త్ పిలర్’గా వ్యవహరించి సమాజానికి సేవ చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. గత పాలకుల హయాంలోనూ ప్రజల సమస్యలపై గొంతెత్తిన దృష్టిలో మంథని ప్రాంతంలోని పాత్రికేయులకు భూ పట్టాల పంపిణీ చేశామని గుర్తు చేశారు. జర్నలిస్టుల అభ్యర్థన మేరకు ఇందిరమ్మ ఇండ్లు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి ఎస్ ఆర్) నిధులు, ఇతర సంక్షేమ పథకాల అమలులో వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment