పేలిపోయిన ఇసుక లారీ ముందు టైరు
– తృటిలో తప్పిన భారీ ప్రమాదం.
వెంకటాపురం, జూన్ 5, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం పట్టణంలో శనివారం సాయంత్రం నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి వేపచెట్టు సెంటర్లో ఇసుక లారీ ముందు టైరు ఆకస్మికంగా భారి శబ్దంతో పేలిపోవటంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. లారి డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, లారీ పక్కకు లాగకుండా ఇంజన్ నిలిపి వేశారు. దీంతో ఎదురుగా వచ్చే, పోయే వాహనాలు పక్కకు జరిగాయి. మండల పరిధిలోని ముకునూరు పాలెం అటవీ ప్రాంతంలో, శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు సంభవించిన సంఘటన మరువక ముందే, లారీ టైర్ పేలి భారీ శబ్దం వినపడడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.