జిల్లావాసులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ దివాకర

జిల్లావాసులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ దివాకర

జిల్లావాసులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ దివాకర

–24 గంటలు అందుబాటులో కంట్రోల్ రూమ్

ములుగు ప్రతినిధి, జులై 5, తెలంగాణ జ్యోతి :  వర్షాకాలం నేపథ్యంలో ములుగు జిల్లాలో ముందస్తు చర్యలు చేపడుతు న్నామని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ప్రజలు అధికారిక వాట్సాప్ చానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని సూచించారు. తక్షణ సహాయం కోసం కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్ నెంబర్  18004257109 ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, నదులు పొంగినప్పుడు వాటిని దాటి ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో టాం టాం ద్వారా సమాచారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశిం చారు. ప్రమాద ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు, కేడింగ్ ఏర్పాటు చేయాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. అత్యవసర సందర్భాల్లో తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శులను సంప్రదించాలని సూచిస్తూ, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోందని ప్రజలు పూర్తిగా సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment