కాటారంలో మిషన్ భగీరథ నీటి సరఫరా షురూ
కాటారం, జూలై 5, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రమైన కాటారంలో మిషన్ భగీరథ మంచినీటి సరఫరా శనివారం ప్రారంభమైంది. గ్రామానికి వచ్చే పైప్ లైన్ కస్తూర్బా ఆశ్రమం పాఠశాల దగ్గర లీకేజ్ అవుతుండడంతో గత 20 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిన విషయం విధితమే. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో కాంట్రాక్టర్, కాంగ్రెస్ నాయకులు చీమల రాజు పైపులైను రిపేరు చేయించారు. కాటారం గ్రామ పంచాయతీలో నిధుల కొరతతో రిపేరు చేయడంలో ఆలస్యమైంది. ఈనేపథ్యంలో ముందుకు వచ్చిన చీమలరాజు రిపేర్ చేయించి కాటారం గ్రామానికి మిషన్ భగీరథ మంచినీరు సరఫరా చేయడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.