జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు

స్కూల్స్, కాలేజీలకు వంద మీటర్ల పరిధిలో మత్తు పదార్థాలు అమ్మొద్దు

జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు

-జులై 31వరకు ధర్నాలు,ఆందోళనలు చేయొద్దు :ఎస్పి శబరిష్

ములుగు ప్రతినిధి, జూలై4, తెలంగాణ జ్యోతి : శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ ఒక ప్రకటనలో తెలిపినారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసివేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment