పోలీసుల వాహన తనిఖీల్లో 72 వాహనాలు సీజ్
– డి ఎస్ పి సూర్యనారాయణ
కాటారం, జూలై 04,తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కాటారం డిఎస్పి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గంట గూడెం లో రెండు గంటలపాటు నిర్వహించిన వాహన తనిఖీల్లో 72 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చి నడిపించరాదని, చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని కేసులలో ఇరుక్కోవాల్సి వస్తుందని 18 సంవత్సరాలు దాటిన యువతి యువకులు లైసెన్స్ తీసుకొని వాహనాలు నడిపించాలని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాహనదారులు హెల్మెట్ ధరించాలని డిఎస్పి సూర్యనారాయణ అన్నారు. తల్లిదండ్రులు తమ సెల్ ఫోన్ లను పిల్లలకు ఇవ్వద్దని వాటిని చూడడం ద్వారా ఇతర వ్యసనాలకు లోనవుతున్నారని, పసిపాపలు ఆడుకోవడానికి లేదా ఏడవకుండా ఉండడానికి సెల్ ఫోన్లను ఇవ్వడం ద్వారా కాంతి కిరణాలతో పిల్లల కళ్ళు దెబ్బతింటాయని డిఎస్పి వివరించారు ట్రాఫిక్ నిబంధనలు ఇతర అంశాలను కార్డెన్ సెర్చ్ లో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సిఐ నాగార్జున రావు, ఎస్సై లు మహేందర్ కుమార్,అభినవ్, సిఆర్పిఎఫ్, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.