కన్నాయిగూడెంలో వాన పడితే వరదలా మారే వీధులు

కన్నాయిగూడెంలో వాన పడితే వరదలా మారే వీధులు

కన్నాయిగూడెంలో వాన పడితే వరదలా మారే వీధులు

– అధికారులు నిర్లక్ష్యమే కారణం..!

కన్నాయిగూడెం, జూలై 4, తెలంగాణ జ్యోతి :  ములుగు జిల్లా కన్నాయిగూడెం గ్రామంలో సైడ్ కాలువల లేకపోవడం వల్ల వర్షపు నీరు నేరుగా ఇళ్లలోకి ప్రవహిస్తూ స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గ్రామ రహదారులపై నిలిచిపోయిన నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పునరావృతమవుతున్న సమస్యపై గ్రామస్తులు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా డ్రైనేజ్ సమస్యపై ప్రశ్నించగా ఎంపీడీఓ అనిత  మాకు ఏమి తెలియదు, నేను నామమాత్రంగా ఉన్నానంటూ గ్రామస్తులకు అసంతృప్తికర సమాధానం ఇచ్చినట్టు సమాచారం. అంతటితో ఆగకుండా “కలెక్టర్‌కు పిర్యాదు చేయండి అంటూ అధికారి చేతులెత్తేసినట్లు వ్యవహరించారని స్థానికులు ఆరోపి స్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ గ్రామ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ స్పందిస్తూ గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఎన్నోసార్లు కార్యదర్శిని, అధికారులను అప్రమత్తం చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎంపీడీఓని ప్రశ్నించినా మా వల్ల కాదు… ఎమ్మెల్యేను లేదా ఎంపీని అడగండి అనే తీరుతో ప్రజలను నిరాశకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

కన్నాయిగూడెంలో వాన పడితే వరదలా మారే వీధులు

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment