మాహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కరపత్ర ఆవిష్కరణ
ఏటూరునాగారం,జూలై3,తెలంగాణ జ్యోతి : మండలంలోని సాయిబాబా దేవాలయంలో జరగనున్న మాహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కరపత్రాన్ని గురువారం కాంగ్రెస్ నాయకులు కుంజ సూర్య ఆవిష్కరించారు. సత్య సాయి శతాబ్ది ఉత్సవాల భాగంగా జూలై 6 (ఆదివారం) ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రుద్రాభిషేకం నిర్వ హించినట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం దేవాలయ కమిటీ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ మాట్లాడుతూ ఈ రుద్రాభిషేకం సాయిబాబా దేవాలయంలో మొట్ట మొదటిసారిగా వేద మంత్రోచ్ఛారణల మధ్య అద్భుతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఇర్సవడ్ల వెంకన్న, ఎర్రబెల్లి మనోజ్, చిటమట రఘు, వసంత శ్రీనివాస్, వెలగందుల మాధవ్, చిందుకూరి వెంకట్రావు, ముక్కెర బిక్షపతి, వావిలాల చిన్న ఎల్లయ్య, ముక్కర లాలయ్య, వావిలాల నర్సింగరావు, నూతి గణేష్, బండారి లక్కీ, గద్దె నవీన్, అర్చకులు ఎల్లాప్రగడ రాధాకృష్ణ శర్మ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.