భారీగా గుడుంబా పట్టివేత – రెండు వాహనాలు స్వాధీనం

భారీగా గుడుంబా పట్టివేత – రెండు వాహనాలు స్వాధీనం

భారీగా గుడుంబా పట్టివేత – రెండు వాహనాలు స్వాధీనం

వెంకటాపురం, జులై3, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు గురువారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా గుడుంబా పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రధాన రహదారిపై తనిఖీలు చేపట్టిన సందర్భంగా సి.జి వైపు నుంచి వస్తున్న ఆటోలో 360 లీటర్ల గుడుంబా తరలిస్తుండగా పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.1.44 లక్షలుగా అంచనా వేయబడింది. ఆటోకు ఎస్కార్ట్‌గా వస్తున్న బైకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు కన్నెబోయిన మల్లేష్, నిమ్మల మనోజ్‌లను అరెస్ట్ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో వెంకటాపురం ఎస్‌ఐ కె. తిరుపతిరావు, పీఎస్‌ఐలు తిరుపతి రెడ్డి, సాయికృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ తిరుపతిరావు మాట్లాడుతూ గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అలాంటి అక్రమాలకు సంబంధించి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment